Abn logo
Sep 28 2021 @ 18:34PM

భారత్‌లో ప్లాంట్ల ఎత్తివేత..అమెరికాలో పెట్టుబడి

వాషింగ్టన్ : భారత్‌లో తన ప్లాంట్లను మూసివేసిన కార్ల కంపెనీ ఫోర్డ్... అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ క్రమంలో...11.4 బిలియన్ డాలర్లతో విద్యుత్తు వాహనాలను తయారు చేసే యూనిట్లను నెలకొల్పబోతోంది. మరో రెండు బ్యాటరీ పార్కులను కూడా ఏర్పాటు చేయబోతోంది. దీంతో... 11 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు ఫోర్డ్ తెలిపింది. మరో దశాబ్దకాలంలో పూర్తి స్థాయిలో విద్యుత్తు వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం వెల్లడించింది.


ఇక 11.4 బిలియన్ డాలర్లతో టెన్నెస్సెలో కార్ల తయారీ యూనిట్లు, కెంటకీలో రెండు బ్యాటరీ తయారీ కేంద్రాలను నెలకొల్పుతామని పేర్కొంది. కార్లల్లో వినియోగించే బ్యాటరీల కోసమే కెంటకీలో ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. బ్యాటరీ సప్లయర్ ఎస్‌కే ఇన్నోవేషన్‌తో కలిసి 11.4 బిలియన్ డాలర్లను ఈ క్రమంలో వ్యయం చేయనుంది ఫోర్డ్ మోటార్స్. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌కే ఇన్నోవేషన్స్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడనుంది. కాగా... సెంట్రల్ కెంటకీలో ట్విన్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్లను నిర్మించనుంది. అలాగే టెన్నెస్సీలో 3600 ఎకరాల భారీ క్యాంపస్‌లో కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది.