Abn logo
Oct 13 2021 @ 19:19PM

పోలీసు అధికారి దారుణం.. విధుల్లో ఉండగానే మహిళతో.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు అభ్యంతరం ఉండదనుకున్నా అంటూ..

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు అధికారికి భారీ షాక్ తగిలింది. విధుల్లో ఉన్నాడన్న విషయాన్నీ మరిచి శృంగారంలో పాల్గొన్నాడన్న అభియోగంపై ఉన్నాతాధికారులు కార్పొరల్ యాన్ వాస్కేస్‌ అనే అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు. కొలియర్ కౌంటీలో ఇటీవల ఈ ఘటన జరిగింది. అతడి నిర్వాకం గురించి మరో వ్యక్తి కౌంటీ పోలీసు ఉన్నతాధికారికి సమాచారం అందించాడు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్న అతడు తన ఉద్యోగబాధ్యతను పక్కన పెట్టి ఇలా చేయడం  సబబు కాదు అంటూ అతడు వ్యాఖ్యానించాడు. అతడు ఆమెతో కలిసి కారు వెనుక సీట్లోకి ప్రవేశిస్తుండగా తీసిన వీడియోను పోలీసులకు అందించాడు. 

అయితే..సదరు మహిళ బాయ్‌ఫ్రెండే ఈ వీడియో తీసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే యాన్ మాత్రం.. ఇలా ఒక్కసారి మాత్రమే జరిగిందని, తనను క్షమించి చిన్న శిక్ష వేయాలని అభ్యర్ధించాడు. అతడు ఇలా వేడుకున్న మరుసటి రోజే మరో షాకింగ్ వీడియో పోలీసులకు చేరింది.  మరో సందర్భంలో అదే మహిళకు యాన్ పోలీసు యూనిఫాంలో ఉండగానే దగ్గరైనట్టు ఆ వీడియోలో కనిపించింది. 

ఈ క్రమంలో..కొత్త వాదన తెరపైకి తెచ్చిన యాన్..ఆ మహిళ, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో తనకు అంతకుముందు నుంచే పరిచయం ఉందని చెప్పాడు. వారిది ఎటువంటి పరిమితులు లేని (ఓపెన్ రిలేషన్ షిప్) బంధమని, బాయ్‌ఫ్రెండ్‌కు అభ్యంతరం ఉండదనుకున్నానని వాదించాడు. అప్పటికే అతడి వ్యవహార శైలిపై ఓ అవగాహనకు వచ్చిన పైఅధికారులు అతడిని చివరికి విధుల నుంచి తొలగించారు. 

తాజా వార్తలుమరిన్ని...