Abn logo
Sep 17 2021 @ 23:39PM

నీటి ముంపు భూములు స్థానికులకే చెందాలి

రైతులతో కలిసి భూములను పరిశీలించేందుకు వెళ్తున్న బైరెడ్డి

 మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

కొత్తపల్లి, సెప్టెంబరు 17: శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునకకు గురైన భూములు బయల్పడిన తర్వాత స్థానికంగా ఉండే వారికే చెందాలని బీజేపీ రాయలసీమ డెవల్‌పమెంట్‌ చైౖర్మన, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని క్రిష్ణానది ఒడ్డున ఉన్న సిద్ధేశ్వరం, బలపాల తిప్ప, జానాల గూడేలను సందర్శించారు. అనంతరం బైరెడ్డి బలపాలతిప్పలో మాట్లాడుతూ 1978లో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ఈ ప్రాంత సాగు భూములు ముంపునకు గురయ్యాయన్నారు. జానాల, బలపాలతిప్ప,సిద్ధేశ్వరం గ్రామాల ప్రజలు ఎక్కడికి వెళ్లలేక 44 ఏళ్లుగా స్థానికంగా ఉండి మునక నుంచి బయల్పడినప్పుడు భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. గత కొనేళ్ళుగా స్థానికేతరులు ఈ భూములు తమవేనని దౌర్జన్యం చేస్తుండడంతో భూములను సాగు చేసుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఈ ప్రాంత ప్రజలతో కలసి పోరాటం చేస్తామని అన్నారు. ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ పోలీస్‌ యంత్రాంగంపై కొందరు ఒత్తిడి తెచ్చి లేనిపోని సెక్షనలు అమలు చేస్తున్నారని, వీరి ఆటలు ఇక సాగనివ్వమని అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజెపీ నాయకులు మల్లెల క్రిష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి శంకర్‌గౌడ్‌ ఉన్నారు.

జూపాడుబంగ్లా: కరోనా నివారణకు దేశంలోనే వ్యాక్సినేషన తయా రు చేయించి లక్షల మంది ప్రాణాలను ప్రధానమంత్రి మోదీ కాపాడారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాయలసీమ డెవల్‌పమెంట్‌ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం జూపాడుబంగ్లాలోని ప్రాథమిక  ఆరోగ్య కేంద్రం వద్ద ప్రధాని జన్మదినం సందర్భంగా వ్యాక్సినేషనను పరిశీలించారు. నాయకులు రమణ, రాంబాబు, సైఫద్దీన, బాలనారాయణగౌడు, అబ్దుల్‌రహిమాన పాల్గొన్నారు.