Abn logo
May 24 2020 @ 04:08AM

రేపటినుంచి ఎగరనున్న విమానాలు

హైదరాబాద్‌కు ప్రతిరోజూ 8 సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో చెన్నైకు..


కోరుకొండ, మే 23: లాక్‌డౌన్‌ కారణంగా రెండునెలలుగా నిలిచిపోయిన విమాన సర్వీసులను మధురపూడి విమానాశ్రయం నుంచి ఈనెల 25నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయని వి మా నాశ్రయ డైరెక్టర్‌ మనోకుమార్‌నాయక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ నియమావళికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం వెలుపల ప్రయాణికులు భౌతిక దూరం పాటించేందుకు 80 సర్కిళ్లు గీశారు. నియమనిబంధనలను మనోకుమార్‌ వివరించారు. ప్రయాణికులు రెండుగంటలు ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలి. ప్రయాణికుడితోపాటు అతడి లగేజీకి శానిటైజ్‌ చేసిన తర్వాత థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తారన్నారు. 37 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగత్ర ఉంటే అనుమతి ఉండదు. వైద్యఆరోగ్యశాఖ రూపొందించిన ప్రశ్నావళికి  సమాధానాలు చెప్పాలి. సమాధానం సంతృప్తిగా ఉంటే ప్రయాణానికి అనుమతిస్తారు. తర్వాత లగేజ్‌ స్కానింగ్‌ చేస్తారు.


పదిమంది ప్రయాణికులకు భౌతికదూరం పాటిస్తూ ఒక గ్రూపు సిట్టింగ్‌ ఏర్పాటు చేశారు. వారిని ప్రత్యేక బస్సులో రన్‌వే వద్దకు తీసుకెళ్తారు. దిగివచ్చిన వారిని కూడా పదిమంది వంతున తీసుకొస్తారు. వాళ్లకు కూడా టెస్ట్‌లు చేసి పంపిస్తారు. ఆరోగ్యంలో తేడా ఉంటే క్వారంటైన్‌కు పంపిస్తారు. విమానం ప్రతిరోజూ రాత్రి 8.55కి హైదరాబాద్‌ నుంచి వచ్చి, 9.20కు బయలుదేరి హైదరాబాద్‌ వెళ్తుంది. విమానాలు చైన్నెకు సోమ, బుధ, శుక్ర, ఆదివారం నడుస్తాయి. సాయంత్రం 5.10కి వచ్చి, 5.40కి బయలుదేరుతుంది. ప్రతి విమానంలో 78మంది ప్రయాణించవచ్చు. టిక్కెట్‌ ధర బుక్‌ చేసిన సమయాన్ని బట్టి రూ.2,500నుంచి రూ.14000 వరకూ ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ప్రతీ ప్రయాణికుడి నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకుంటారు.

Advertisement
Advertisement
Advertisement