Abn logo
Sep 24 2020 @ 00:59AM

కరోనాతో ఐదుగురి మృతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి జిల్లాలో బుధవారం కరోనాతో ఐదుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు, వికారాబాద్‌ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 963 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లాలో 497, మేడ్చల్‌ జిల్లాలో 421, వికారాబాద్‌ జిల్లాలో 45 మంది ఉన్నారు. 


రంగారెడ్డి జిల్లాలో..

ఇబ్రహీంపట్నం / షాద్‌నగర్‌ / చేవెళ్ల / కందుకూరు / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 548 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌ వచ్చింది.  షాద్‌నగర్‌ డివిజన్‌లో 320 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 38 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. చేవెళ్ల డివిజన్‌లో 257మందికి  కరోనా పరీక్షలు చేయగా 21మందికి పాజిటివ్‌ వచ్చింది. కందుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 38మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో కందుకూరు చౌరస్తాకు చెందిన ఐదుగురు, గూడూరు, రాచులూరు, తుక్కుగూడ, బాచుపల్లి గ్రామాలకు చెందిన ఒక్కోక్కరు ఉన్నారు. శంషాబాద్‌లో 72మందికి కరోనా పరీక్షలు చేయగా 9 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ / కులకచర్ల : వికారాబాద్‌ జిల్లాలో కరోనా విజృం భిస్తుంది. బుధవారం వికారాబాద్‌లో 18, బషీరాబాద్‌లో 8, తాం డూరులో 7, బొంరాస్‌పేటలో 4, పూడూరులో 3, నవాబుపేట, బం ట్వారం, యాలాల్‌, కొడంగల్‌ మండలాల్లో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 61 మందికి కరోనా పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ అని తేలింది. ఇందులో తిర్మలాపూర్‌లో ఒకే కుటుంబంలో 3, చౌడాపూర్‌ 1, పరిగి మండలం నస్కల్‌లో 1, పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ :  మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 59 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.

Advertisement
Advertisement
Advertisement