Advertisement
Advertisement
Abn logo
Advertisement

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు

  తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు విస్తృత ప్రచారం

పాయకరావుపేట రూరల్‌, డిసెంబరు 2 : తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ల వద్దని ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు. మండలంలోని పాల్మన్‌పేట, వెంకటనగరం, పెంటకోట తదితర తీరప్రాంత గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి, మత్స్యకారులను అప్రమత్తం చేశారు.  లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వలలు, పడవలను జాగ్రత్త చేసుకోవాలని సూచిం చారు. అలాగే, పాడిబడిన ఇళ్లలో ఉన్నవారు ఖాళీ చేయాలన్నారు. వర్షాలకు ఇటువంటి ఇళ్ల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తించాలన్నారు.

Advertisement
Advertisement