ఆ సినిమా దర్శకుడే విక్కీ కౌశల్, Katrina Kaifల పెళ్లికి మొదటి అతిథి

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల పెళ్లి డిసెంబర్ 9న జరగబోతోందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్  ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో వీరు వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. బంధువులు, సన్నిహితులను మాత్రమే తమ పెళ్లికి ఆహ్వానిస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దాదాపుగా 200 మంది వరకు అతిథులు ఈ పెళ్లికి రాబోతున్నారని సమాచారం. 


 తాజాగా విక్కీ కౌశల్  నటించిన చిత్రం ‘‘గోవిందా నామ్ మేరా’’. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి అయింది. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఆ సినిమాకు దర్శకుడిగా పనిచేసిన శశాంక్ ఖైతాన్‌కు మొదటి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. హంప్టీ శర్మ కీ దుల్హనియా, బద్రీ నాథ్ కీ దుల్హనియా వంటి తదితర చిత్రాలకు శశాంక్ దర్శకత్వం వహించాడు. వరుణ్ ధావన్ పెళ్లికి కూడా అతడు హాజరయ్యాడు.  


పెళ్లికి బాలీవుడ్ సెలెబ్రిటీలైన కరణ్ జోహార్, ఫరా ఖాన్, జోయా అక్తర్ తదితరులు కూడా హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. మెహందీ, సంగీత్ సంబరాలు డిసెంబరు 7, 8తేదీల్లో జరగబోతున్నాయి. సంగీత్ ఫంక్షన్‌కు కరణ్ జోహార్, ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. తమ పెళ్లికి వచ్చే వారు మొబైల్ ఫోన్‌లను తీసుకు రావొద్దని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా ఒక్క ఫొటో కూడా లీక్ కావొద్దని వారు ఆ జంట భావిస్తోంది. 

Advertisement

Bollywoodమరిన్ని...