Abn logo
Jul 13 2020 @ 16:21PM

శివగామి మాత్రమే కాదు.. కట్టప్ప, దేవసేన కూడా..?

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన అద్భుత చిత్రం `బాహుబలి` ఇటీవలె ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. `బాహుబలి` తల్లి శివగామి పాత్ర కోసం ముందుగా అతిలోక సుందరి శ్రీదేవిని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను కాదని రమ్యకృష్ణను తీసుకున్నారు. 


శివగామి మాత్రమే కాదు.. కట్టప్ప, దేవసేన పాత్రల కోసం కూడా ముందుగా వేరే వారిని అనుకున్నారట. కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను అనుకున్నారట. అలాగే హీరోయిన్ దేవసేన పాత్రకు లేడీ సూపర్‌స్టార్ నయనతారను తీసుకోవాలనుకున్నారట. అయితే అప్పటికే నయన్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో అనుష్కను తీసుకున్నారట.


Advertisement
Advertisement
Advertisement