Abn logo
Jul 30 2021 @ 22:46PM

భూమి వైపు దూసుకొచ్చిన ఫైర్‌బాల్స్.. ఆందోళనలో ప్రజలు

హ్యూస్టన్ : విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్ర‌హాలు, ఉప‌గ్రహాలు, ఉల్క‌లు ఉన్నాయి.  అప్పుడ‌ప్పుడు భూవాతావ‌ర‌ణంలోకి ఆస్ట్రాయిడ్స్ ప్ర‌వేశించి మండిపోతూ భూమిపై ప‌డుతుంటాయి.  జూరాసిక్ కాలంలో ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్ట‌ినందువల్లే ఆ భారీ జంతువులు న‌శించిపోయాయి.  అయితే... అప్పుడ‌ప్పుడు మ‌న‌కు ఆకాశం నుంచి రాలిప‌డుతున్న న‌క్ష‌త్రాలు, భూమివైపుకు దూసుకొస్తున్న ఉల్క‌లు క‌నిపిస్తుండడం తెలిసిందే.  ఇలాంటి దృశ్యాలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మ‌రోసారి క‌నిపించాయి.


భారీ సైజుట్లో ఉన్న ఫైర్‌బాల్స్ మండుతూ భూమివైపుకు దూసుకురావ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురయ్యారు. అయితే...  ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌డం కానీ, నష్టం వాటిల్లడం కానీ జరగలేదు.  దీనికి సంబందించిన వీడియోల‌ను నాసా చిత్రీక‌రించింది.  సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ఈ ఫైర్‌బాల్స్‌ను వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తంమీద ఈ ఫైర్‌బాల్స్‌కు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  ఇలాంటి దృశ్యాలు గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని కొంద‌రు చెబుతుంటే, మ‌రికొంద‌రు మాత్రం ఇవి స‌హ‌జ‌మేనని వ్యాఖ్యానిస్తున్నారు. 


అమెరికా నగరాల్లోమరిన్ని...