Abn logo
May 23 2020 @ 20:49PM

ఢిల్లీలో కోవిడ్-19 ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్-19 ఆసుపత్రిలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఈ ఆసుపత్రి ఉంది. ఏడుగురు రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణాలేమిటో ప్రస్తుతానికి తెలియలేదు. 


అగ్నిమాపక శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ,  హౌజ్ ఖాస్ ప్రాంతంలోని సిగ్నస్ ఆర్థోకేర్ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పారు. ఈ ఆసుపత్రిలోని మూడో అంతస్థులో ఈ ప్రమాదం జరిగిందన్నారు. 8 అగ్నిమాపక శకటాలను హుటాహుటిన తరలించి, మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. 


ఈ ఆసుపత్రి కోవిడ్-19 ఆసుపత్రి అని, ఏడుగురు రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.




Advertisement
Advertisement
Advertisement