Abn logo
Jan 21 2021 @ 14:22PM

పిఠాపురం రాజా వారి కోట వద్ద కారు నుంచి ఎగిసిపడిన మంటలు..

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రాజా వారి కోట వద్ద పార్కింగ్ చేసిన కారు నుంచి మంటలు ఎగసిపడ్డాయి. అగ్ని మాపక అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేశారు. ఓ ప్రైవేట్ హాస్పటల్ డెంటల్ డాక్టర్ హరిణికి చెందిన కారుగా గర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది.


Advertisement
Advertisement
Advertisement