Abn logo
Sep 21 2021 @ 09:05AM

బాణసంచా పేలుడులో ఒకరి మృతి

ఐసిఎఫ్‌(చెన్నై): విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. సరస్వతి పాళయంలో కోటీశ్వరన్‌ అనే వ్యక్తికి బాణాసంచా కర్మాగారం ఉంది. సోమవారం కార్మికులు ఒక గదిలో రసా యన మిశ్రమం కలుపుతుండగా పేలుడు సంభవించింది. పేలుడుకు గది పూర్తిగా నేలమట్టం కాగా, అందులో పనిచేస్తున్న చిన్నమునియప్పన్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. కర్మాగారం యజమాని కోటీశ్వరన్‌ సహా ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.


క్రైమ్ మరిన్ని...