Abn logo
Sep 16 2021 @ 00:00AM

ఉప్పుటేరులో బోటు దగ్ధం

భానుగుడి(కాకినాడ), సెప్టెంబరు 16: కాకినాడ జగన్నాథపురం ఉప్పుటేరులో బోటును స్టార్‌ చేస్తున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ అయ్యి మంటలు చెలరేగి బోటు ఆహుతయ్యింది. పక్కనే ఉన్న డీజిల్‌ టిన్నులు అంటుకోవడంతో మరింతగా మంటలు చెలరేగాయి. అస్తి నష్టం తప్ప ప్రాణనష్టం లేకపోవడంతో మత్య్సకారులు ఊపిరిపీల్చుకున్నారు. కాకినాడ జగన్నాథపురం ఉప్పుటేరులో పాలెపు జయప్రకాష్‌కు చెందిన బోటు ఏపీ-ఈ2 ఎంఎం837ను శుక్రవారం వేటకు వెళ్లేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో బోటులో అగ్ని ప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు రావడంతో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదం  జరిగినట్లు సమాచారం రావడంతో జగన్నాథపురం అగ్నిమాపక కేంద్రం నుంచి ఒక ఫైర్‌ ఇంజన్‌, కాకినాడ నుంచి రెండు ఫైర్‌ ఇంజన్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బోటులో ఉన్న మత్య్సకారులు, సిబ్బంది బోటు నుంచి బయటకు రావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బోటులో వలలు, ఇతర సామగ్రి కాలిపోవడంతో సుమారు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. బోటులో గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని నగర డీఎస్పీ భీమారావు, కాకినాడ 1 టౌన్‌ సీఐ రామ్మోహన్‌ రెడ్డి మత్స్యశాఖ ఏడీ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, రాష్ట్ర ఫిషర్‌మెన్‌ కమ్యూనిటీ చైర్మన్‌ షేరు చిన్న తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.