Abn logo
Mar 26 2020 @ 06:46AM

లాక్‌డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై పోలీసు కేసు

పుదుచ్చేరి : కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా దేశంలో విధించిన లాక్ డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన పుదుచ్చేరిలో వెలుగుచూసింది. కొవిడ్-19 ను కట్టడి చేసేందుకు పుదుచ్చేరిలో లాక్ డౌన్ విధించినా పుదుచ్చేరి నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ తన ఇంటి వద్ద 200 మందికిపైగా ప్రజలకు కూరగాయల సంచులను పంపిణీ చేశారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని,  సామాజిక దూరం పాటించాలని లాక్ డౌన్ విధించినా దాన్ని ఉల్లంఘించి గుంపులుగా గుమిగూడారు. లాక్ డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఎమ్మెల్యే జాన్ కుమార్ పై పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం నారాయణస్వామి గతంలో ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement