Sep 24 2021 @ 15:53PM

వివాదంలో Kapil Sharma షో.. ఓ ఎపిసోడ్‌లో ఆ ఒక్క సీన్ వల్ల..

ముంబై: కపిల్‌శర్మ షో నిర్మాతలకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక ఎపిసోడ్‌లో భాగంగా కొందరు నటులు కోర్టురూమ్ సీన్‌లో అల్కహాల్‌ను సేవించడంతో వారికి వ్యతిరేకంగా కేసు దాఖలైంది. కోర్టురూమ్ సీన్‌లో నటించిన వారు కోర్టును అగౌరపరిచారంటూ ఒక న్యాయవాది వారికి వ్యతిరేకంగా కేసును దాఖలు చేశారు. 


ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కపిల్‌శర్మ షో సోని‌టీవీలో ప్రసారం అవుతోంది. ఈ ఎపిసోడ్‌ను సోనిటీవీ అలసత్వంతో ప్రసారం చేసింది. ఈ షోలో పాల్గొనే నటులు మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక ఎపిసోడ్‌లో భాగంగా కోర్టు సీన్‌లో పాల్గొన్న నటులు అల్కహాల్‌ను సేవించారు. అల్కహాల్‌ను సేవించడం కోర్టుధిక్కారం కిందకు వస్తుంది. సెక్షన్ 356/3 కింద వారికి వ్యతిరేకంగా కేసును నమోదు చేయాలి. అటువంటి ద‌ృశ్యాలను ప్రసారం చేయకూడదు ’’ అని చెప్పారు. ఈ కేసు అక్టోబర్ 1న విచారణకు వస్తుంది.