మండపేట, డిసెంబరు 4: ప్రజలపై పన్నుల భారం, నిత్యావసరాల ధరలు పెంచుతున్న ప్రభుత్వ తీరును ప్రజల తరపున అసెంబ్లీలో టీడీపీ ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తమ గొంతు నొక్కుతుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. పట్టణాల్లో ఇంటి పన్నుల పెంపుపై టీడీపీ అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విదుదల చేశారు. పన్నుల పెంపు బిల్లును తాము వ్యతిరేకించామన్నారు. పన్నుల పెంపునకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సభ నుంచి వాకౌట్ చేశామన్నారు.