సోషల్‌ టాక్‌: తారల సండే సందడి!

షూటింగ్‌లకు కొంత గ్యాప్‌ ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు తారక్‌? ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ సమీపంలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో తన పెద్ద కుమారుడిని ముద్దాడుతూ కనిపించారు. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 


అల్లు అర్జున్‌ తన తనయ అర్హ పుట్టిన రోజు వేడుకల్ని దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో గ్రాండ్‌గా నిర్వహించారు.


‘లైగర్‌’ చిత్ర షూటింగ్‌ అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో జరుగుతోంది. అక్కడ అనన్య పాండే సందడి చేస్తోంది. గుర్రపు స్వారీకి సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. 


శ్రద్థాదాస్‌ నటించిన ‘స్లీపర్‌ సెల్‌’ వెబ్‌ సిరీస్‌ ఈనెల 28న విడుదలవుతుందంటూ ట్రైలర్‌ను షేర్‌ చేశారు. Advertisement
Advertisement