అల్లరి పిల్ల అనుపమ.. అందాల భామల తళుకులు!

52 ఏళ్లు వెనక్కి వెళ్లారు అమితాబ్‌ బచ్చన్‌. ఆయన నటించిన తొలి చిత్రం జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. 1969 ఫిబ్రవరి 15న ఆయన సైన్‌ చేసిన మొదటి సినిమా ‘సాథ్‌ హిందూస్థ్థానీ’ 1969 నవంబరు 7న విడుదలైంది. ఆ చిత్రంలోని ఫొటోని అభిమానులతో పంచుకుని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మరి కొందరు తారలు అందాల ఫొటోలను పంచుకున్నారు. 


1. ఆదివారం విశ్వనాయకుడు కమల్‌హాసన్‌, అనుష్క, దర్శకుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు రానా. 


2. ఎఫ్‌3 షూటింగ్‌లో సరదాగా టీ టైమ్‌ అంటూ టీమ్‌తో దిగిన ఫొటో షేర్‌ చేశారు తమన్నా. 


3.తన స్నేహితుడు త్రివిక్రమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సునీల్‌. త్రివిక్రమ్‌తో కలిసి గతంలో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.


4. జిమ్‌లో వర్కవుట్స్‌ పూర్తి చేసి సెల్ఫీ తీసుకుంది రాయ్‌లక్ష్మీ. అలసటతో ఏ పనినీ ఆపొద్దు. ఎలాగైనా పూర్తి చేయండి’ అని రాసుకొచ్చారామె! 


5.తన చర్మ సౌందర్యాని తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు పూజాహెగ్డే. 


6.సంతోషానికి ఎన్నో కారణాలు అంటోంది పూజితా పొన్నాడ. 


7.కొత్త ఫొటోషూట్‌తో సెగలు పుట్టిస్తున్నారు.. పూర్ణ, నిక్కీ తంబోలి, కృతి కర్భంద. 

Advertisement
Advertisement