Abn logo
Dec 2 2020 @ 00:43AM

ఆటోకు పండగ ఉత్సాహం

న్యూఢిల్లీ: దీపావళి సీజన్‌లో వాహన రంగం మెరుగైన విక్రయాలను నమోదు చేసుకుంది. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ సహా హ్యుండ య్‌, కియా, హోండా, మహీం ద్రా, టాటా మోటార్స్‌, ఎంజీ మోటార్స్‌ దేశీయ అమ్మకాల్లో సానుకూల వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహన కంపెనీల సేల్స్‌ సైతం మంచి వృద్ధిని కనబర్చాయి.

 ట్రాక్టర్ల విభాగంలో జోరు కొనసాగుతుండగా.. వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత కొద్ది నెలలతో పోలిస్తే మాత్రం కాస్త పుంజుకున్నాయి. పండగ సీజన్‌ కావడంతో గడిచిన రెండు నెలల్లో ఆటోమొబైల్‌ సేల్స్‌ జోరందుకున్నప్పటికీ.. మున్ముందు నెలల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాహన కంపెనీలు మాత్రం ధీమాగా ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement