Advertisement
Advertisement
Abn logo
Advertisement

8 నెలల కూతురిని చూసి మురిసిపోతున్న ఈ తండ్రి తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం.. ఇప్పుడా పాపను అనాథను చేసింది..!

ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో అమిత్ బన్సల్(31) అనే ఇంటిరియర్ డిజైనర్‌కు పింకీ(28) అనే మహిళతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఎనిమిది నెలల పాప కూడా ఉంది. ఆరు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమిత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య చేతులు, మెడపై గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఇప్పుడు వారిద్దరి చిన్నారి పాప అనాథగా మిగిలిపోయింది. ఈ కేసులో పోలీసులు అమిత్ తండ్రి రామ్‌కిషన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసుల కథనం ప్రకారం.. మీరట్ నగరంలో నివసించే రామ్‌కిషన్ బన్సల్ 2018లో తన కుమారుడు అమిత్‌ను తన స్నేహితుడి కూతురు పింకీతో వివాహం చేశాడు. అమిత్, పింకీ మధ్య గొడవలు జరిగేవి. ఈ కారణంగా అమిత్ డిప్రెషన్‌లో ఉండేవాడు. వారి వైవాహిక జీవితాన్ని బాగుచేసేందుకు రామ్‌కిషన్ అమిత్, పింకీకి నచ్చజెప్పేవాడు. ఈ మధ్యే వారిద్దరికీ అస్ట్రేలియా తిరిగి రమ్మని పంపిచాడు. ఇక ఏ సమస్యలేదనుకొని అందరూ అనుకుంటుండగా.. ఒక రోజు రామ్‌కిషన్ తన మనవరాలితో బయటికి వెళ్లాడు. ఇంట్లో రామ్‌కిషన్ భార్య(అమిత్ తల్లి) మరొక గదిలో ఉంది. పింకీ కూడా ఇంట్లో లేదు. ఆ సమయంలో అమిత్ తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.కాసేపటి తరువాత పింకీ ఇంటికి వచ్చింది. భర్త శవాన్ని చూసి షాక్‌కు గురైంది. ఇదంతా నీవల్లే జరిగిందని అత్త దూషించడంతో పింకీ వంటింట్లో నుంచి పెద్ద కత్తి తీసుకొని చేతి మనికట్టుని కోసుకుంది. ఇంతో రామ్‌కిషన్ తన మనవరాలిని ఆడిస్తూ అక్కడికి చేరుకున్నాడు. పింకీ వల్లే తన కొడుకు చనిపోయాడని భావించి ఆ పక్కనే పడి ఉన్న కత్తిని తీసుకొని పింకీ మెడపై దాడి చేశాడు.


రామ్‌కిషన్ భార్య పోలీసులకి ఫోన్ చేసింది. వారు వచ్చినప్పుడు పింకీ ఇంకా బతికే ఉంది. ముందు రామ్‌కిషన్ పింకీనే స్వయంగా తన మెడను, చేతులను గాయపరుచుకుందని బుకాయించాడు. కానీ అమిత్ ఉరివేసుకుంటూ పక్కనే ఒక ఫోనే వీడియో రికార్డింగ్ కోసం పెట్టిన ఫోన్లో జరిగినదంతా రికార్డ్ అయిపోయింది. 


పోలీసులు రామ్‌కిషన్ విచారణ చేయగా.. తన కోడలు పింకీ.. అమిత్‌ను మానసికంగా హింసించేదని, వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. అమిత్ ఆత్మహత్యకు అదే కారణమని చెప్పాడు. కోడలి వల్ల తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కోపంలో పింకీపై దాడి చేశానని అన్నాడు. ప్రస్తుతం రామ్‌కిషన్ పోలీసుల అదుపులో ఉండగా.. అతని భార్య తన మనవరాలితో ఒంటరిగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement