Abn logo
Oct 24 2020 @ 19:56PM

కూటమి చైర్మన్‌గా ఫరూఖ్, డిప్యూటీగా మెహబూబా

Kaakateeya

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) చైర్మన్‌గా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా శనివారంనాడు నియమితులయ్యారు. ఆయనకు డిప్యూటీగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. కూటమి కన్వీనర్‌గా సీపీఎం నేత మొహమ్మద్ యూసుఫ్ తరిగామి ఉంటారు. పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజద్ లోనె కూటమి ప్రతినిధి (స్పోక్స్‌పర్సన్)గా నియమితులయ్యారు. కూటమి నేతలు మెహబూబా ముఫ్తీ నివాసంలో వీరంతా తొలిసారి సమావేశమై, ఒకప్పటి జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం జెండాను కూటమి సింబల్‌గా నిర్ణయించారు.

370వ అధికరణ రద్దయినప్పటి నుంచి గత ఏడాదిగా జమ్మూకశ్మీర్‌లో పాలనపై నెలరోజుల్లోగా ఓ శ్వేతపత్రాన్ని కూటమి తరఫున విడుదల చేస్తామని సమావేశానంతరం మీడియాకు సజద్ లోనె తెలిపారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు, దేశ ప్రజలకు వాస్తవాలను వివరించే విధంగా నిజాలు, గణాంకాల ఆధారంగా శ్వేతపత్రం ఉంటుందని చెప్పారు. తదుపరి సమావేశం 15 రోజుల తర్వాత జమ్మూలో నిర్వహించాలని నిర్ణయించామని, అనంతరం నవంబర్ 17న శ్రీనగర్‌‍లో సదస్సు నిర్వహిస్తామని వివరించారు.

Advertisement
Advertisement