Abn logo
May 27 2020 @ 05:40AM

నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలి

ప్రతీ రైతు దీన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి

జిల్లా అవగాహన సదస్సులో మంత్రి దయాకర్‌రావు

హాజరైన మంత్రి సత్యవతి, రైతు సమితి చైర్మన్‌ పల్లా


మహబూబాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నియంత్రిత పద్ధతి సాగు అవశ్యకమని, దీనిని ప్రతి రైతు చాలెంజ్‌గా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో మంగళవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నియంత్రిత సాగు విధానం-లాభసాటి వ్యవసాయంపై వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ద యాకర్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అనేక సంక్షే మ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతు బీమ ప్రవేశపెట్టి రుణమాఫీ చేశారని అన్నారు. 


తెలంగాణ సోన (సన్నరకం) అధికంగా పండించాలని విజ్ఞప్తి చేశా రు. మహబూబాబాద్‌ మిర్చి దేశంలోనే నంబర్‌వన్‌గా పేరుగాంచిందని, ఇక్కడ మిర్చి రైతుల కోసం ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం వెయ్యి ఎకరాలను సేకరించడానికి కలెక్టర్‌ నడుం బిగించారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే నియంత్రిత సాగు పద్ధతిని తీసుకువచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోఢ్‌ అన్నారు.


ఖమ్మం జిల్లాలో సీతారాం ప్రాజె క్టు నీటిని బయ్యారం వరకు రావడం లేదని, ఆ నీటి ని కాల్వల ద్వారా వచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీ సుకువెళ్లామని చెప్పారు. రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు కేటాయించిందన్నారు. కాళేశ్వరం జలాలు జిల్లాకు రావడంతో పంట దిగుబడి రెండింతలు పెరిగిపోయిందన్నారు. అనంతరం జిల్లా పంటల ప్రణాళికను ఆవిష్కరించి సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, మహబూబాబాద్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యేలు బానోత్‌ శం కర్‌నాయక్‌, డీఎ్‌స.రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ గుడిపుడి నవీన్‌రావు, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా కోఆర్డినేటర్‌ బాలాజీనాయక్‌, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ మర్రి రంగారావు, జడ్పీ సీఈవో సన్యాసయ్య, జిల్లా వ్యవసాయాధికారులు చత్రునాయక్‌, కె.సూర్యనారాయణ, ఏడీఏ లక్ష్మీనారాయణ, ఏవో తిరుపతిరెడ్డి, ఓ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement