Abn logo
Jun 29 2021 @ 15:49PM

శివ్వంపేట తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

మెదక్: రాష్ట్రంలో తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన సంఘటన మరువక ముందే అటువంటి హత్యాయత్న సంఘటన జిల్లాలో జరిగింది. శివ్వంపేట మండల తహశీల్దార్‌‌ భానుప్రకాశ్‌పై మండలంలోని రైతులు డీజిల్ పోశారు. దీంతో తహశీల్దార్‌‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  సోమవారం మండలంలోని తాళ్లపల్లి తండా వాసి బాలు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సకాలంలో తహశీల్దార్‌‌ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లనే బాలుకు బీమా డబ్బులు రాలేదని రైతులు ఆరోపించారు. 

తహశీల్దార్‌‌ కార్యలయం ఎదుట బాలు మృతదేహంతో రైతులు ఆందోళన చేశారు. అలాగే కార్యాలయంలోకి వెళ్లి తమ పైనే రైతులు డీజిల్ పోసుకున్నారు. ఆ తరువాత తహశీల్దార్‌ భానుప్రకాశ్‌పై రైతులు డీజిల్ పోశారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.