Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులకు న్యాయం జరిగేలా చర్యలు

  • జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ

కడియం, డిసెంబరు 2: రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. గురువారం ఆయన కడియం ఆవ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం రవాణా కోసం రైతులకు బస్తా ఒక్కంటికి రూ.25 అదనంగా చెల్లించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా గతంలో ఆవలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవల స్పందన కార్యక్రమంలో చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ చేస్తామని జేసీ చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దారు ఎం.సుజాత, వ్యవసాయాధికారి కళ్యాణసూర్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement