Abn logo
Sep 17 2021 @ 00:53AM

వైసీపీ ఏలుబడిలో దగాకు గురైన రైతులు : టీడీపీ

సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

కందుకూరు, సెప్టెంబరు 16: వైసీపీ ప్రభుత్వంలో రైతులు దగాకు గురయ్యారని నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు, యువనేత ఇంటూరి రాజేష్‌ విమర్శించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ నియోజకవర్గ  కమిటీ ఆధ్వర్యంలో రైతుకోసం తెలుగుదే శం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వచేసుకుని రైతులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతున్నా గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి కానరావడం లేదన్నారు. ధాన్యం రైతులకు నెలలు గడచినా డబ్బులు జమ కాకపోవడంతో వారి బాధలు మరింత దారుణంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగిన డీజిల్‌ ధరలు వ్యవసాయంపై పెనుభారం మోపుతున్నామన్నారు. ఉచిత విద్యుత్‌ పథకానికి కూడా మంగళం పాడే దిశగా అడుగులు వేస్తుండటంతో రైతులు వ్యవసాయాన్ని వదిలేయక తప్పని పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  నిరసన కార్యక్రమం అనంతరం సబ్‌ కలెక్టరు అపరాజిత సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు దామా మల్లేశ్వరరావు, వేముల గోపాల్‌, జనిగర్ల నాగరాజు, రాచగర్ల సుబ్బారావు, మాదాల లక్ష్మీనరసింహ్మం (చిన్నా), నార్నె రోశయ్య, బెజవాడ ప్రసాదు, జి.మోషే, జి.చెంచురామయ్య, షేక్‌ రఫి, బొల్లినేని నాగేశ్వరరావు, ఎన్‌వి సుబ్బారావు, కలవకూరి యానాది, శిఖామణి  పాల్గొన్నారు.