Abn logo
Oct 20 2020 @ 00:06AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రాయచోటిటౌన్‌, అక్టోబరు19: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో వ్యవసాయశాఖ ఏడీ సావిత్రి, ఏవోలు మోహన్‌, నాగమధుసూదన్‌లతో ఆయన వర్షాలకు దెబ్బతిన్న పంటలపైన, పంటల బీమా పరిహారం, రబీ సీజన్‌లో రైతులు ఏయే పంటలు వేసుకోవాలి తదితర అంశాలపై చర్చించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 16 వేల హెక్టార్లకుపైగా పంటలు సాగయ్యాయని, 15 శాతం పంట కూడా రాలేదన్నారు. ఖరీ్‌ఫలో పంట నష్టపరిహారాన్ని మండల యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలన్నారు.రైతులకు పంటలపై అవగాహన కల్పించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.


పంటలకు మార్కెట్‌లో అధిక ధర ఉంటే రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చునన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిదంబర్‌రెడ్డి, మండల కన్వీతదితరులు పాల్గొన్నారు. 


కంచాలమ్మ గండి చెరువుకు జలహారతి   

రాయచోటి మండలం ఎగువ అబ్బవరం సమీపంలోని కంచాలమ్మ గండి చెరువుకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి జలహారతి పట్టారు. సోమవారం జెడ్పీ మాజీ వైస్‌ చైర్మెన్‌ దేవనాధరెడ్డి, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డిలతో కలిసి జలహారతిలో పాల్గొని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆనంద్‌రెడ్డి, పల్లపు రమేష్‌, ఆసి్‌ఫఅలీఖాన్‌, రియాజ్‌  పాల్గొన్నారు. 


Advertisement
Advertisement