Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ సంస్థల ప్రవేటీకరణపై ఆందోళన

ఉదయగిరి రూరల్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనునిరసిస్తూ శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ రైతు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ సంస్థల ప్రవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రైతు ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయమ్మ, నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కామాక్షమ్మ, కృష్ణ, సురేష్‌, మధు, వెంకటేశ్వర్లు, పెంచలరాజు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement