Abn logo
Oct 27 2021 @ 01:21AM

5,34,828 మందికి ‘రైతు భరోసా’

రైతులకు మెగాచెక్కు అందజేస్తున్న మంత్రి, విప్‌, ఎంపీ, కలెక్టర్‌ తదితరులు

అనంతపురం, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెం డో విడత రైతు భరోసా ద్వారా 5,34,828 మంది రైతు కు టుంబాలకు లబ్ధి చేకూరినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నా రు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రెండోవిడత రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్‌ యంత్రసేవ పథకాలకు సంబంధించిన లబ్ధిని వీడి యో కాన్ఫరెన్స ద్వారా బటన నొక్కి, రైతు ఖాతాలకు జమ చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్సకు కలెక్టరేట్‌ నుంచి రోడ్లు, భవనాల శాఖామంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కా పు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, జేసీ ని శాంతకుమార్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత హాజర య్యా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద 5,34,828 మంది రైతులకు ఒ క్కొక్కరికి రూ.2వేల చొప్పున రూ.109.17 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. 2021-22 సంవత్సరానికిగానూ మొదటి వి డతగా ఈ ఏడాది మే నెలలో రూ.5500 చొప్పున వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద 5,53,647 మంది రైతులకు రూ.304.74 కోట్లు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు తెలిపారు. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద 2020 ఖరీఫ్‌లో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని, స కాలంలో చెల్లించిన 96,529 మంది రైతుల ఖాతాల్లో రూ. 16.87 కోట్లు వడ్డీ రాయితీ జమ చేశారన్నారు. డా.వైఎస్సార్‌ యంత్రసేవ పథకం కింద 57 కన్సూమర్‌ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచసీ) గ్రూపులకు రెండో విడత సబ్సిడీ కింద రూ.69.33 లక్షల సబ్సిడీని కన్సూమర్‌ హైరింగ్‌ సెంటర్‌ గ్రూ పుసభ్యుల ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్‌, ఎంపీ, కలెక్టర్‌.. మూడు పథకాలకు సంబంధించి మెగా చెక్కులను రైతులకు అందజేశారు. వీడియో కాన్ఫరెన్సలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన పామిడి వీరాంజనేయులు, జేడీఏ చంద్రానాయక్‌, ఏడీఏ వి ద్యావతి, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొ

న్నారు.