Abn logo
Jul 7 2020 @ 03:23AM

ఫ్యాన్స్‌ అరుపుల ఆడియో

వినూత్నంగా ఇంగ్లండ్‌, విండీస్‌ టెస్ట్‌ సిరీస్‌ 

లండన్‌: ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య బుధవారం నుంచి జరిగే మూడు టెస్టుల సిరీ్‌స ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరగనుంది. అయితే, ప్రేక్షకుల గోల లేకుండా ఆటకు ఊపురాదన్న సంగతి గ్రహించిన నిర్వాహకులు.. వినూత్నంగా నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రేక్షకుల అరుపులతో కూడిన నకిలీ ఆడియోను స్టేడియంలో ప్లే చేయనున్నారు. అంటే.. గతంలో మ్యాచ్‌లు జరిగినప్పుడు స్టేడియంలో అభిమానులు ఈలలు, అరుపులతో ఎలా సందడి చేసేవారో.. అలాంటి శబ్దాలతో కూడిన ఆడియోను మ్యాచ్‌ సందర్భంగా ప్లే చేస్తారు. దీంతో స్టేడియంలో అభిమానులు కనిపించకపోయినా.. ఆడియోల రూపంలో వాళ్ల హంగామా ఉంటుంది. ఓవర్‌కు మధ్యలో ఓసారి.. మ్యాచ్‌ మధ్యలో కొన్నిసార్లు ఇలా నకిలీ శబ్దాలతో పాటు సంగీతాన్ని స్టేడియంలో వినిపించేలా ఇంగ్లండ్‌, విండీస్‌ క్రికెట్‌ బోర్డులు ఒప్పందం చేసుకున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement