Abn logo
Jul 17 2021 @ 16:04PM

జీహెచ్‌ఎంసీ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉమ డబ్బులివ్వలేదని, ఉద్యోగం నుంచి తొలగించారని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రమేష్‌ వాపోయారు. ఉద్యోగం నుంచి తొలగించడంతో జీహెచ్‌ఎంసీ ఎదుట రమేష్‌ కుటుంబం పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అబిడ్స్‌లో 15 ఏళ్లుగా శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా రమేష్‌ పనిచేస్తున్నారు. ప్రతి నెలా డబ్బులు ఇవ్వాలని ఉమ వేధించేదని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.