Abn logo
May 25 2020 @ 11:11AM

దొంగతనం నెపం మోపారని ఓ కుటుంబం ఆత్మహత్య

గుంటూరు : జిల్లాలోని బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వీరారెడ్డి (40), భార్య రమణమ్మ (38), కుమార్తె పోలేరమ్మ (13)గా గుర్తించారు. దొంగతనం నెపం మోపారని అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నారు. పొలంలో మోటర్ దొంగతనం చేశాడని గత వారం రోజులుగా వీరారెడ్డి పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement