Advertisement
Advertisement
Abn logo
Advertisement

Family members చోరీల బాట..16.5 తులాల బంగారు నగలు స్వాధీనం

భార్యాభర్తలు, కుమార్తె అరెస్టు 

హైదరాబాద్‌ సిటీ: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కామాటిపురా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.5 లక్షల విలువగల 16.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీకుమార్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వట్టేపల్లి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన జకియా బేగం(43), ఆమె భర్త మహమ్మద్‌ అబ్దుల్‌ సలీం(40), కుమార్తె ఆయేషాసిద్దిక్‌ (19) ముఠాగా ఏర్పడ్డారు. చందూలాల్‌ బారాదరి, గాజిబండ, గుల్షన్‌ నగర్‌ ప్రాంతాల్లో అద్దెకు ఇల్లు కావాలని తల్లీకూతుళ్లు సంచరిస్తుంటారు. ఏదైనా ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు కనిపించగానే తల్లి లోపలికి వెళ్తోంది. కుమార్తె బయట ఉండి పరిస్థితి గమనిస్తుంది. లోపల ఎవరైనా ఉంటే అద్దె ఇల్లు గురించి అడగడం.. ఎవరూ కనిపించకపోతే చేతికి అందిన విలువైన వస్తువులు అపహరించి బయటకు వస్తుంది. భార్య, కుమార్తెను వజీర్‌వలీ మసీదు వద్ద భర్త దించి తాడ్‌బన్‌ చౌరస్తా వద్ద నిలబడతాడు. అపహరించిన వస్తువులతో వచ్చిన భార్య, కుమార్తెను వాహనంపై తీసుకెళ్తాడు. పోలీసులకు ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. వారిపై సంతో్‌షనగర్‌, మాదన్నపేట, భవానీనగర్‌ పీఎస్‌ పరిధుల్లో నాలుగు కేసులున్నాయి.

Advertisement
Advertisement