Abn logo
May 20 2020 @ 21:10PM

రోడ్డుపై దొరికిన రెండు బ్యాగులు.. తెరిచి చూడగా షాక్..

కెరోలిన్ కౌంటీ: రోడ్డుపై దొరికిన పది లక్షల డాలర్ల(రూ. 7 కోట్ల 55 లక్షలు) నగదును వర్జీనియాకు చెందిన జంట పోలీసులకు అందజేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెరోలిన్ కౌంటీకి చెందిన డేవిడ్, ఎమిలీ తమ పిల్లలతో కలిసి చాలా రోజుల తరువాత ప్రకృతిని ఆస్వాదించేందుకు బయటకు వచ్చారు. ట్రక్‌లో వెళ్తుండగా రోడ్డుపై పెద్ద బ్యాగు కనిపించింది. ఆ బ్యాగు దగ్గరకు వెళ్లగా.. ఆ దగ్గరలోనే ఇంకో బ్యాగు కనిపించింది. ఆ బ్యాగులను ట్రక్‌లో పడేసి వారి పని వారు చూసుకుని ఇంటికి చేరుకున్నారు. బ్యాగుల్లో చెత్త తప్ప ఏముంటుందిలే అని తెరిచి చూడగా.. అందులో కట్టల కొద్దీ డాలర్లు ఉన్నాయి. అంత డబ్బును చూసిన డేవిడ్, ఎమిలీ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా అక్కడకు చేరుకున్న పోలీసులు డబ్బును లెక్కపెట్టారు. రెండు బ్యాగుల్లో దాదాపు పది లక్షల డాలర్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ డబ్బు ఎవరిదన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని.. తమకు ఇంతవరకు డబ్బు పోయిందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. డబ్బులు పోగొట్టుకున్న వారికి డేవిడ్, ఎమిలి డబ్బులు ఎంతో సహాయపడ్డారని.. వారి కృషికి తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు.

Advertisement
Advertisement
Advertisement