Abn logo
Oct 25 2020 @ 17:25PM

ఫడ్నవీస్‌కు ఇప్పటికి అర్థమై ఉంటుంది: సంజయ్ రౌత్

Kaakateeya

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీహార్ ఎన్నికల ఇన్‌చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న కరోనా బారినపడడంపై శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఫడ్నవీస్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన రౌత్.. బయట కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆయనకు ఇప్పుడు అర్థమై ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారంటూ ఇటీవల ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా బారినపడిన ఫడ్నవీస్‌కు అత్యుత్తమ చికిత్స అందేలా థాకరే చర్యలు తీసుకున్నట్టు రౌత్ పేర్కొన్నారు. 

తనకు కరోనా సోకినట్టు ఫడ్నవీస్ ట్వీట్ చేసిన వెంటనే ఆయన కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షించారు. కొందరు మాత్రం వదిన చేతి అప్పడాలు తినాలని, పతంజలి కోర్నిల్ ట్యాబ్లెట్లు వాడాలని, గోమూత్రం తాగాలని సూచించారు. లాక్‌డౌన్ నుంచి తాను ప్రతి రోజు పనిచేస్తున్నానని, భగవంతుడు తనకు కొంత విరామం ఇవ్వాలని అనుకున్నట్టు ఉన్నాడని, అందులో భాగంగానే తనకు కరోనా సోకినట్టు ఉందని ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని ఫడ్నవీస్ సూచించారు.  


Advertisement
Advertisement