Abn logo
Sep 23 2021 @ 18:10PM

Facebook‌ టెక్నాలజీ హెడ్ పోస్టు నుంచి తప్పుకుంటున్న మైక్

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ మైక్ ష్రోఫెర్(ష్రెప్) కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు షేర్ చేశారు. ఫేస్‌బుక్ అగుమెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలీ హెడ్, సీనియర్ లీడర్ ఆండ్రూ బోస్‌వర్త్ 2022లో ఈ పోస్టును భర్తీ చేస్తారని తెలిపారు. ష్రెప్ 13 ఏళ్లుగా ఫేస్‌బుక్‌కు సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది ఎప్పుడైనా కంపెనీ మొదటి సీనియర్ ఫెలోగా పార్ట్‌టైమ్ పాత్రకు మారనున్నట్టు చెప్పారు.


ఫేస్‌బుక్ అగుమెంట్ రియాలిటీ/వర్చువల్ రియాలిటీని బోస్ క్రియేట్ చేయగా, 2020లో దానిని ఫేస్‌బుక్ రియాలిటీ ల్యాబ్స్‌గా మార్చారు. తదుపరి సీటీవో బోస్ ఫేస్‌బుక్ రియాలిటీ ల్యాబ్స్‌‌కు సారథ్యం వహిస్తూనే అగుమెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సహా మరెంటినో పర్యవేక్షిస్తారని ఉద్యోగులకు తెలియజేస్తూ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా బోస్ టీంలో మరికొన్ని బృందాలు కూడా చేరుతాయన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption