Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొంపముంచిన ఫేస్‌బుక్ స్నేహం.. న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ..

గుంటూరు : ఫేస్‌బుక్ స్నేహం కొంపముంచింది. మంగళగిరి మండలం కూరగల్లులో రాజేష్ అనే యువకుడు ఫేస్‌బుక్ పరిచయం కారణంగా దారుణంగా మోసపోయాడు. రాజేష్‌కు ఆన్‌లైన్‌లో ఓ యువతి పరిచయమైంది. నూడ్ వీడియోలతో ఇద్దరూ వీడియో చాటింగ్ చేసుకున్నారు. అనంతరం సదరు యువతి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించింది. కొంత నగదు పంపిన తర్వాత భరించలేక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో రాజేష్ ఫిర్యాదు చేశాడు. డబ్బు పంపకపోతే న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని యువతి బెదిరింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులో రాజేష్ పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement