Abn logo
Oct 11 2021 @ 01:39AM

ఆలయాలకు అదనపు ఆదాయం?!

కామారెడ్డి జిల్లాలోని సలాబత్‌పూర్‌లో జరుగుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు

ప్రధాన ఆలయాల పరిధిలో కల్యాణ మండపాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన దేవాదాయ శాఖ అధికారులు 

ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మాణ పనులకు శ్రీకారం

మొత్తం 5,051 ఆలయాల పరిధిలో 3,600 ఎకరాలకు పైగా భూములు

నిజామాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాల పరిధిలో భక్తులకు సౌకర్యాలను కల్పించడంతో పాటు ఆదా యం పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రధాన దేవాలయాల పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, భక్తుల కోసం గదుల నిర్మా ణం, గెస్ట్‌ హౌజ్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతులు రాగానే నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఆలయాల పరిధిలో భూములు అనుకూలంగా ఉన్నచోట వీటి నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే సలాబత్‌పూర్‌లో రూ.8కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రధాన ఆలయాలలో పనులు చేపట్టేందుకు అదికారులు చర్యలను చేపట్టారు. 

ఫ ఉమ్మడి జిల్లాలో 5,051 ఆలయాలు

ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 5,051 దేవాలయాలు ఉన్నాయి. వీటి పరిధి లో 3600 ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. ఇవేకాకుండ ప్రధాన ఆలయాలు ఉన్న మున్సిపాలిటీలు, మండలకేంద్రాల్లో వాణిజ్య అవసరాలకు పనికివచ్చే భూములు ఉన్నాయి. జిల్లాలో ప్రధాన దేవాలయాల పరిఽధిలో భక్తుల తాకిడి పెరగడం, సౌకర్యాలు తక్కువగా ఉండడంతో ఉమ్మడి జిల్లాల అధికారులు నజర్‌ పెట్టారు. దేవాలయాలకు ఆదాయం పెంచడంతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు నిర్ణయించారు. ఈ ప్రధాన దేవాలయాల పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కల్యాణమండపాలు భక్తుల కోసం గదుల నిర్మాణం, గగెస్ట్‌హౌజ్‌ల నిర్మాణం చేపట్టాలని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ల ఆధ్వర్యంలో దేవాదాయశాఖ అధికారులకు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

ఫ నీలకంఠేశ్వరాలయం పరిధిలో భూములు

జిల్లా పరిధిలోని ప్రధాన దేవాలయాల్లో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. పురాతన ఆలయం అయిన నీలకంఠేశ్వర ఆలయం పరిధిలో భూములు ఉండ డంతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఆలయానికి అవసరమైన కల్యాణ మండపం నిర్మాణంతో పాటు భక్తుల కోసం గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రధాన నగరం నడిఒడ్డున ఈ ఆలయం ఉండడంతో ఆదాయం కూడా షాపింగ్‌ కాంప్లెక్స్‌ ద్వారా ఎక్కువ వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకునారు.. నగరం శివారులో ని మాధవనగర్‌ సాయిబాబా ఆలయం పరిధిలో కూడా షాపింగ్‌ కాంప్లెక్స్‌, కల్యాణ మండపం గదుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎడపల్లి మం డలం జాన్కంపేటలోని లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తుల కోసం గదు ల నిర్మాణం, గెస్ట్‌హౌజ్‌, బోధన్‌ ఏక చక్కెశ్వర ఆలయంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌, కల్యాణ మండపం చేపట్టాలని ప్రతిపాదనలు పంపించారు. పోచంపాడ్‌ రామాలయం, రామలింగేశ్వర ఆలయం పరిధిలో గెస్ట్‌ హౌజ్‌లు, భక్తుల కోసం గదుల నిర్మాణం కల్యాణ మండపం చేపట్టాలని ప్రతిపాదనలు పంపించారు. భీంగల్‌లోని లక్ష్మినరసింహస్వామి ఆలయం పరిదిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కల్యాణ మండపం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తులకు గదులతో పాటు కల్యాణ మండపం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 

ఫ కామారెడ్డి జిల్లా పరిధిలో..

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ లక్ష్మినరసింహ ఆల యం పరిధిలో గెస్ట్‌హౌజ్‌, భక్తులకు గదులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కల్యాణ మం డపం చేపట్టాలని నిర్ణయించారు. భిక్కనూర్‌ సిద్దరామేశ్వర ఆలయం పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌, గెస్ట్‌హౌజ్‌ భక్తుల కోసం గదులు, కల్యాణ మండపం నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు పంపించారు. రామారెడ్డి కాలభైరవ స్వా మి ఆలయంలో ఇవే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ హనుమా న్‌ ఆలయం పరిధిలో ఇప్పటికి రూ.8 కోట్ల తో నిర్మాణాలు చేపట్టారు.  ఉమ్మడిజిల్లా పరిధిలో  నిర్మాణాలు చేపట్టాలని ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించామ ని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ సోమయ్య తెలిపారు.