Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెనక్కి తగ్గిన Kuwait.. ఆ కేటగిరీ వలసదారులకు రూట్ క్లియర్!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లోని 60ఏళ్లకు పైబడిన వలసదారులకు తీపి కబురు. యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లు దాటిన వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కువైత్ వెనక్కి తీసుకుంది. దీంతో ఈ కేటగిరీ వలసదారుల వర్క్ పర్మిట్లు ఇకపై యధావిధిగా రెన్యూవల్ కానున్నాయి. 14 నెలల క్రితం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లు దాటిన వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీని ఆపేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని ఆ దేశ మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం రద్దు చేసింది. ఈ కేటగిరీ ప్రవాసులకు వర్క్ పర్మిట్‌లను జారీ చేయడాన్ని నిషేధించడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని వెల్లడించింది.

2020 ఆగస్టులో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జారీ చేసిన ఈ నిర్ణయం చట్టబద్ధంగా ఉనికిలో లేదని తెలియజేసింది. అసలు పీఏఎం డైరెక్టర్‌కు ఈ నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదని పేర్కొంది. వర్క్ పర్మిట్ల జారీకి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు, విధానాలు ఉన్నాయని తెలిపింది. గురువారం ప్రత్యేకంగా భేటీ అయిన మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం.. 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయడం చట్టబద్ధంగా చెల్లదని స్పష్టం చేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కువైత్ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి కొత్త విధానాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఇది పూర్తిగానే ఈ కేటగిరీ వలసదారుల వర్క్ పర్మిట్లను పునరుద్ధరించడం ప్రారంభించునున్నట్లు తెలుస్తోంది.

అలాగే పాత నిబంధన అమలు చేసిన మొదటి ఆరు నెలల్లో సుమారు 4వేలకు పైగా మంది ప్రవాసులు కువైత్ వదిలి వెళ్లినట్లు సమాచారం. దీంతో వీరికి కూడా తిరిగి వర్క్ పర్మిట్ల జారీ విషయమై కువైత్ సర్కార్ ఆలోచిస్తోంది. ఇక 4.6 మిలియన్‌గా ఉన్న కువైత్ జనాభాలో 3.4 మిలియన్ల మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 80వేల మంది ప్రవాసులకు యూనివర్శిటీ డిగ్రీలు లేవని సమాచారం. ఇదిలాఉంటే.. కువైత్ తీసుకున్న తాజా నిర్ణయంపై వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం కువైత్ వచ్చేవారిపై ఇలాంటి కండిషన్స్ పెట్టడం దారుణమని ప్రవాసులు వాపోయారు. చివరకు పాలకులు తమ తప్పు తెలుసుకుని సరియైన నిర్ణయం తీసుకున్నారని వలసదారులు చెబుతున్నారు. కాగా, 2017లో తీసుకువచ్చిన కువైటైజేషన్‌ పాలసీలో భాగంగానే కువైత్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో విదేశీయులను తగ్గించి దేశ పౌరులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకొచ్చిందే కువైటైజేషన్‌ పాలసీ.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement