Abn logo
Sep 22 2020 @ 00:00AM

విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 22: పాలమూరులో జరుగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో జరుగుతున్న విస్తరణ పనులను పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రహదారిని తవ్వి వదిలేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా ప్రారంభ సమయంలో రోడ్డును తవ్వి, కంకర వేసి పనులు చేయకుండా వదిలేశారన్నారు. దుమ్ము, దూళితో ప్రజలు, దుకాణాల యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని చోట్ల 60 ఫీట్లు, మరికొన్ని చోట్ల 50 ఫీట్లు తవ్వకాలు చేశారని, అంతటా ఒకేలా చేపట్టాలని కోరారు. పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌యాదవ్‌, సాయిబాబ, రాములు యాదవ్‌, సుభాష్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement