Abn logo
Aug 6 2020 @ 00:29AM

విస్తరిస్తున్న కరోనా

వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి)/ పెద్దేముల్‌/ కొడంగల్‌/నవాబ్‌పేట/యాచారం/ చేవెళ్ల/ ఆమనగల్లు/కందుకూరు/ఇబ్రహీంపట్నం/శంషాబాద్‌ రూరల్‌ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా ఊరూరా విస్తరిస్తోంది. జిల్లాలో బుధవారం కరోనాతో ఇద్దరు మృతి చెందగా, 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాండూరులో 7, వికారాబాద్‌లో 3, కొడంగల్‌లో 2, నవాబుపేట, ధారూరులో ఒక్కో పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 563కు చేరుకుంది. యాక్టివ్‌ కేసులు 283 ఉండగా, 38 మంది ఆసుపత్రుల్లో, 247 మంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 259 మంది రికవరీ కాగా, 21 మంది మృతి చెందారు. బుధవారం జిల్లాలో 210 నమూనాలు సేకరించగా, వాటిలో 92 నెగిటివ్‌ రాగా, 14 పాజిటివ్‌ వచ్చినట్లు డీఎంహెచ్‌వో సుధాకర్‌ సింధే తెలిపారు. పెద్దేముల్‌ మండలంలో 15మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా కానిస్టేబుల్‌కు, లాహోటీ కాలనీలో మరొక వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు తెలిపారు. నవాబుపేట మండలం గుబ్బడిపత్తేపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. 

 

కరోనాను జయించిన పోలీసులకు సన్మానం

కరోనా నుంచి కోలుకున్న పోలీసు అధికారులను వికారాబాద్‌ ఎస్పీ నారాయణ శాలువాలతో ఘనంగా సన్మానించారు. బుధవారం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో వారితో ఎస్పీ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోలుకున్న అధికారులు మాట్లాడుతూ, ఎస్పీ, అదనపు ఎస్పీ తమలో మనోధైర్యం నింపడంతో కరోనాను జయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎంఏ రషీద్‌, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మారెడ్డి, దాసు, వెంకటగిరి పాల్గొన్నారు. 


రంగారెడ్డి జిల్లా  యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో 8మందికి పరీక్షలు చేయగా, మేడిపల్లికి చెందిన గర్భిణికి పాజిటివ్‌గా తేలింది. చేవెళ్ల పీహెచ్‌సీలో 55 మందికి పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆమనగల్లు, మైసిగండి, తలకొండపల్లి పీహెచ్‌సీల పరిధిలోని 47 మందికి పరీక్షలు నిర్వహించగా ఆమనగల్లుకు చెందిన ముగ్గురికి, కర్కల్‌ పహాడ్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. కందుకూరులో 55మందికి పరీక్షలు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. వీరంతా మహేశ్వరంతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన వారుగా వైద్యులు నిర్ధారించారు. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ పీహెచ్‌సీలో పరీక్షలు నిర్వహించగా పెద్దషాపూర్‌లో ముగ్గురికి, శంషాబాద్‌లో ఒకరికి పాజిటివ్‌గా వచ్చింది. అలాగే నర్కూడలో ఒకరికి, మధురానగర్‌ ఒకరికి, కాపుగడ్డ ఒకరికి, ఆర్టీఐఏ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో  ఒకరికి, నార్సింగ్‌కు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. 

Advertisement
Advertisement