Abn logo
Sep 21 2020 @ 01:14AM

విషాదం మిగిల్చిన విహారయాత్ర

బోడకొండ వాటర్‌ఫాల్స్‌ వద్ద జారిపడి యువకుడి దుర్మరణం


మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిది బోడకొండ వాటర్‌ఫాల్స్‌ వద్ద ప్రమాదవశాత్తు యువకుడు జారిపడి దుర్మరణం చెందాడు. హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన 11 మంది సిక్కు యువకులు చెన్నారెడ్డిగూడ-బోడకొండ వాటర్‌ఫాల్స్‌ను వీక్షించేందుకు ఆదివారం వచ్చారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాటర్‌ఫాల్స్‌ ప్రవాహం ప్రమాదకరంగా మారాయి.


దీంతో అక్కడికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాదిగా వచ్చిన పర్యాటకులు తెల్లబండపై నుంచి వస్తున్న జలపాతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో యువకులందరూ పైకి వెళ్లగా అందులో ఈశ్వర్‌సింగ్‌(16) ప్రమాదవశాత్తు జారిపడడంతో బలమైన గాయాలై మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటే్‌షగౌడ్‌ తెలిపారు. వాటర్‌ఫాల్స్‌లో నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉందని పర్యాటకులు ఎవరూ అటువైపు వెళ్లొద్దని సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement