Abn logo
Jul 11 2020 @ 05:14AM

శ్రీశైలానికి తొలి వరద

శ్రీశైల జలాశయానికి స్వల్ప వరద

హంద్రీ ద్వారా పారుతున్న అధిక నీరు


కర్నూలు, జులై 10(ఆంధ్రజ్యోతి): శ్రీశైలానికి ఈ సీజన్‌లో తొలి వరద మొదలైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదిలోకి నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో సుంకేసుల డ్యాంకు నీటి ప్రవాహం పెరగడంతో గురువారం రాత్రి రెండు గేట్ల ద్వారా కొన్ని గంటలపాటు దిగువకు నీరు వదిలారు. సుంకేసుల ద్వారా 8,824 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 5,640 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి మొదలైంది. శ్రీశైలానికి ప్రస్తుత గణాంకాల ప్రకారం 14,464 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుత నీటి మట్టం 814.10 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 214 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 36.76 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement