Abn logo
Oct 24 2020 @ 05:09AM

ఎంసెట్‌ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన

Kaakateeya

కంచరపాలెం పాలిటెక్నిక్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మొదలు

తొలిరోజు 20 వేల ర్యాంకు వరకు పిలుపు

552 మంది విద్యార్థులు హాజరు


కంచరపాలెం, అక్టోబరు 23: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన అధికారులు ప్రారంభించారు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలతోపాటు కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఈ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం తొలిరోజు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఒకటి నుంచి పది వేల ర్యాంకు పొందిన అభ్యర్థులను పిలవగా 287 మంది హాజరయ్యారు. పది వేల ఒకటి నుంచి 20 వేల వరకు కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు పిలవగా 265 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసినట్టు క్యాంపు అధికారి జయప్రకాష్‌రెడ్డి తెలిపారు. కాగా, శనివారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 20,001 నుంచి 35 వేల ర్యాంకు వరకు, కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 35,001 నుంచి 50 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన వుంటుందని తెలిపారు.  

Advertisement
Advertisement