Abn logo
Dec 1 2020 @ 12:38PM

గంటపాటు నిరీక్షించి ఓటు వేసిన వీహెచ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు దొరక్క సామాన్య జనంతో పాటు ప్రముఖులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా మాజీ ఎంపీ వీ హనుమంతరావు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాగ్ అంబర్ పేట డిడి కాలనీలోని సత్యసాయి విద్యా మందిర్‌కు వచ్చారు. అయితే ఓటు కనిపించక గందరగోళ పరిస్థితుల మధ్య ఆయన గంటపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఓటు కనిపించడంతో వీహెచ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ సార్వత్రిక ఎన్నికల మాదిరిగా బీజేపీ అగ్రనేతలు హైదరబాద్‌పై దాడి చేశారని మండిపడ్డారు. శత్రుదేశాలపై సర్జికల్ స్ట్రైక్‌లు చేయాలి కానీ సొంత రాష్ట్రాలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం వింతగా ఉందన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. వరద సహాయం పేరుతో డబ్బులు ఇచ్చి ఓట్లను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదు, చూడను కూడా అని వీహెచ్ అన్నారు. 

Advertisement
Advertisement