Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ విషయంలో కేసీఆర్ మాట తప్పాడు: డీకే అరుణ

హైదరాబాద్: ఎన్నికలకు ముందు దళితుడిని సీఎంను చేస్తామన్న కేసీఆర్.. గెలిచాక మాట తప్పారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్.. ఫాంహౌస్‌లో బంధీని చేశాడని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనకు త్వరలోనే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉప‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement