Abn logo
Apr 6 2020 @ 19:32PM

శ్రీలక్ష్మి కనకాల అకాల మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్: సినీ నటుడు రాజీవ్ కనకాల సోదరి, రచయిత, పాత్రికేయురాలు శ్రీలక్ష్మి కనకాల సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమె అకాల మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో మరణించడం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఆమె మరణంతో కుమార్తెలిద్దరూ తల్లి లేని వారవడం మరింత బాధాకరమని చంద్రబాబు ట్వీట్ చేశారు.


Advertisement
Advertisement
Advertisement