Abn logo
Jan 18 2021 @ 00:10AM

రాష్ట్రంలో రాక్షసపాలనను సాగనంపాలి

టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి పిలుపు 

జగన్‌ ప్రభుత్వంపై ధ్వజం

 తెల్లబాడులో ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

 హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు

భారీగా తరలివచ్చిన శ్రేణులు


మద్దిపాడు జనవరి 17: రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆ దివారం సాయంత్రం మద్దిపాడు మండలం తెల్లబాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీ ఆర్‌ విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్యఅతి థిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ మ ండలాధ్యక్షుడు మండవ జయంత్‌బాబు అ ధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూరు మాట్లాడుతూ టీడీపీని మళ్లీ అఽధికారంలోకి తేవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. రైతులకోసం అధినేత చంద్రబాబునాయుడు అసెంబ్లీ పోడియం ముందు బైఠాయిస్తే రూ.500కోట్ల బీమా సొమ్మును ప్రభుత్వం అప్పటికప్పుడు కట్టిం దని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు దా మచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ  జిల్లాలో ఏ దైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదే శం హయాంలోనేన్నారు. ఒంగోలులో శాశ్వ త అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సీఎం జగన్‌ బాధ్యా తరహితంగా పనిచేస్తున్నారని, ప్రశ్నిస్తే అ క్రమకేసులు పెట్టి అరెస్ట్‌ చేసి వేధిస్తున్నార ని ధ్వజమెత్తారు. సింగరాయకొండ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వం సం చేసిన వార్తను రాస్తే విలేఖరులపై కే సులు పెట్టడం దారుణమన్నారు. ఎస్సీ, ఎ స్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి నిధు లు ఇవ్వడం లేదని ఆరోపించారు. వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చి తెలుగుదేశం కా ర్యకర్తలను సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. అద్దంకి ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ వ్యాపారులపై అక్రమ కేసులు బనాయించి దందాలకు పాల్పడడం ప్రభుత్వ పాలసీగా మారిందని ఎద్దేవా చేశారు. అమరావతిని మార్చి రాజధానిని విశాఖపట్నంకు తరలిం చడం మూర్ఖమైన చర్యని చెప్పారు. సంత నూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీఎ న్‌.విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సీఎంకు కుల, మత పిచ్చి ఉందన్నారు. వైసీపీ నా యకులు ఇసుక అమ్మడమే ధ్యేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. ముందుగా ఎ న్టీఆర్‌ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు.  కాగా వెల్లంపల్లి నుంచి పార్టీ కార్యకర్తలు మోటారుసైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. దొ డ్డవరం అంకమ్మతల్లి దేవాలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.  కార్యక్రమంలో దర్శి ఇన్‌చార్జి పమిడి రమే ష్‌,  రైతు సంఘం అధ్యక్షుడు కొం డ్ర గుంట వెంకయ్య, మాజీ ఎంపీపీ ముప్ప వరపు వీరయ్యచౌదరి, మండవ రంగారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, కొండపల్లి పవన్‌ కుమార్‌, మల్లిపెద్ది శేషు, పర్చూరి హరి, మల్లిపెద్ది నరేంద్ర, చలిచీమ రామాంజనే యులు, కుంచాల రామాంజనేయులు, ము త్తనపల్లి రామలింగయ్య, రెబ్బవరపు ప్రభా కర్‌, నారిపెద్ది వరహాలచౌదరి, రావి ఉమా మహేశ్వరరావు, మారెళ్ల హరికుమార్‌, ఉ ప్పుగుండూరి నాగేశ్వరరావు, కడియాల ర ఘుబాబు, గోరంట్ల చిరంజీవి, చుంచు హ రిబాబు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement