Advertisement
Advertisement
Abn logo
Advertisement

Odisha:హోరు గాలిలో..భారీ వర్షం కురుస్తుండగా 41 మంది గర్భిణుల ప్రసవం

 ఇద్దరు నవజాత కుమార్తెలకు గులాబ్ తుపాన్ పేరు

బెర్హంపూర్(ఒడిశా): గులాబ్ తుపాన్ వేళ హోరు గాలిలో...కుండపోత వర్షం కురుస్తుండగా 41మంది గర్భిణులు పండంటి బిడ్డలకు ప్రసవించారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఇద్దరు మహిళలు తమ నవజాత కుమార్తెలకు గులాబ్ తుపాను పేరు పెట్టారు.ఒడిశా రాష్ట్రానికి చెందిన కునీరైట్, నందిని సబర్ అనే మహిళలకు వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గులాబ్ తుపాన్ సంభవించిన రోజే కుమార్తెలు జన్మించారు. గులాబ్ తుపాన్ వేళ జన్మించిన కుమార్తెలకు గులాబ్ పేరు పెట్టమని ఆసుపత్రి నర్సులు తల్లులకు సూచించారు. అంతే వారిద్దరూ తల్లులు తమ కుమార్తెలకు గులాబ్ పేరు పెట్టారు.

సోరడపల్లి గ్రామానికి చెందిన నందిని సబర్ కు హెల్త్ సెంటరులో బాలిక ప్రసవించింది.అంకులి పంచాయతీలోని కమ్యూనిటీ ఆసుపత్రిలో కునీరైట్ ఒక బాలికకు జన్మనిచ్చింది.హోరు గాలిలో కుండపోత వర్షం కురుస్తుండగా పుట్టిన బిడ్డలకు గులాబ్ తుపాన్ గుర్తుగా గులాబ్ పేరు పెట్టారు. ‘‘నా బిడ్డ అందరికీ గుర్తుండిపోయే రోజు జన్మించినందున నా బిడ్డకు సంతోషంగా గులాబ్ పేరు పెట్టాను’’ అని నందిని సబర్ చెప్పారు.

 గులాబ్ తుపాన్ సమయంలో 241 మంది గర్భిణులను ప్రసవం కోసం సమీప ఆసుపత్రులకు తరలించామని గంజాం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఉమాశంకర్ మిశ్రా చెప్పారు. గులాబ్ తుపాన్ తీరాన్ని సమీపిస్తున్నపుడు 41 మంది మహిళలు ప్రసవించారని డాక్టర్ మిశ్రా చెప్పారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్ మిశ్రా వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement