Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

వాక్సినేషన్‌పై కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ స్పెషల్‌ డ్రైవ్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4: జిల్లాలో అందరూ వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ, హెల్త్‌ సెక్రెటరీ ఉన్నతాధికారులతో వ్యాక్సినేషన్‌పై సమీక్షించి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలన్న ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని జైజవాన్‌నగర్‌, మహాలక్ష్మివాడ, తాటిగూడ వార్డుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ శైలజతో కలిసి కలెక్టర్‌ విస్త్రృతంగా పర్యటించారు. వ్యాక్సిన్‌ పట్ల ప్రజలకున్న అపోహలు తొలగించి వారితో మాట్లాడి దగ్గరుండి టీకాలు వేయించారు. ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్‌ అధికారులను నియమించి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫస్డ్‌డోసు 25 శాతం, సెకండ్‌ డోసు 12వేల వరకు పెండింగ్‌ ఉన్న దృస్ట్యా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇందుకు సహకరిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇందులో డీపీవో శ్రీనివాస్‌రావు, డీపీఆర్‌వో ఎన్‌.భీమ్‌కుమార్‌, మెప్మా సిబ్బంది భాగ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. 

ఇంద్రవెల్లి: ప్రతీ ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీపీవో శ్రీనివాస్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి తిరుగుతూ వ్యాక్సిన్‌ తీసుకున్నారా? లేదా? అని డీపీవో ఆరా తీశారు. 

సిరికొండ: మండలంలోని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని జడ్పీ సీఈవో గణపతి అన్నారు.  శనివారం మండలంలోని రాంపూర్‌(బి) గ్రామం లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎంపీడీవో సురేష్‌తో కలిసి ఆయన పరిశీలించారు.   

బోథ్‌: కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలందరికీ రెండో డోసు  వేయాలని ఎంపీడీవో రాధా కోరారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్యాధికారి నవీన్‌రెడ్డి, ఎంపీఈఓ జీవన్‌రెడ్డిలతో సమావేశంలో ఆమె మాట్లాడారు. 

అలాగే, కరోనా థర్డ్‌వేవ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని బోథ్‌ సీఐ నైలునాయక్‌ సూచించారు. శనివారం ఆయన బోథ్‌లో విలేకరులతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కు వాడడం తప్పని సరి అని, లేదంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.  

తలమడుగు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఒమైక్రాన్‌ వైరస్‌ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కోరారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్‌ వద్ద, ఆసుపత్రిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో ఎంపీడీఓ రమాకాంత్‌, డా.రాహుల్‌, వైద్య సిబ్బంది ఉన్నారు. 

Advertisement
Advertisement