Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి: రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 2: జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించు కోవాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యాక్సినేషన్‌పై విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా ఉంద న్నారు. జిల్లాలో 90వేలకు పైగా అర్హతగల వారు ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ వేయించు కోలేదన్నారు. వారంతా వెంటనే వేచించుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులుకూడా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చ న్నారు. ఇతర జిల్లాతో పోల్చినప్పుడు చివరి స్థానంలో ఉండడం బాధ కలగించిందన్నారు. డిసెంబరు 15లోపు జిల్లాలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. మూడవవేవ్‌ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ చేయించుకుంటే రక్షణ పొందే అవకాశం ఉందన్నారు. ప్రజలు దీన్ని గమనించాల న్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రజలను చైతన్యపర్చడానికి కులసంఘాలతో సమా వేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో వ్యాక్సి నేషన్‌ ప్రక్రియపై సమీక్ష చేయడానికి రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ త్వరలో జిల్లాకు రానున్నారని తెలిపారు. ఆశా, ఏఎన్‌ఎంలను ఇంటింటి సర్వేకు మరోసారి పంపుతామన్నారు.

Advertisement
Advertisement